కొత్త కథను పట్టిన రామ్ గోపాల్ వర్మ...!!

murali krishna
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కి చాలా గ్యాప్ తర్వాత ఓ కథ అయితే దొరికింది. ఆల్రెడీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో టీజర్ కూడా వదిలాడు..


ఇక సినిమానే..'.. ఇది తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) చేసిన కామెంట్స్ చూసిన వారంతా చేస్తున్న కామెంట్స్. కొన్ని రోజులుగా వర్మ సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాంట్రవర్సీ మ్యాటర్ ఏదీ దొరకలేదో.. లేక ఆయనకి ఇష్టమైంది ఇంకా దిగలేదో తెలియదు కానీ.. ఇన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న వర్మకి.. 'గరికపాటి' (Garikapati) రూపంలో ఇప్పుడు మాంచి కాంట్రవర్సీ మ్యాటర్ దొరికింది. ఇక వరసబెట్టి వాయించుడు మొదలెట్టాడు. ఆ వాయించుడు చూస్తుంటే.. త్వరలో ఈ మ్యాటర్‌తో ఆయన సినిమా అనౌన్స్ చేసినా చేసేయవచ్చు.. అనేలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్‌గా జరిగిన 'అలయ్ బలయ్' (Alai Balai) కార్యక్రమంలో మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు (Garikapati narasimha Rao).. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్.. వైరల్ అవడమే కాకుండా.. అనేక చర్చలకు తావిచ్చాయి. అయితే, చిరంజీవి హుందాగా వ్యవహరించి.. మ్యాటర్‌ని అక్కడితో క్లోజ్ చేశానని అనుకున్నాడు కానీ.. ఆ తర్వాత నాగబాబు, ఉత్తేజ్, అనంత శ్రీరామ్ వంటివారు చేసిన కొన్ని కామెంట్స్, లేఖలు, వీడియోలు ఈ విషయాన్ని మరింత కాంట్రవర్సీకి దారితీసేలా చేశాయి. అయితే, మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu).. ఆ తర్వాత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. గరికపాటివారి నుండి క్షమాపణలు ఆశించడం లేదు అంటూ ఓ పోస్ట్ చేసి.. దాదాపు విషయం సద్దుమణిగేలా చేశారు. కానీ ఇప్పుడు తెరపైకి వర్మ వచ్చారట.


నాగబాబు చేసిన కామెంట్స్ ని రీ కామెంట్ చేస్తూ.. అటు గరికపాటిని, ఇటు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ.. వర్మ సంధించిన అస్త్రాలు మరోసారి ఈ విషయాన్ని టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా చేశాయి. 'అయిపోయిన పెళ్లికి బాజాలు' అనే సామెతగా ఇప్పుడు వర్మ ఈ విషయాన్ని లేవనెత్తడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అదే.. ఈ అంశంపై ఆయన సినిమా తీసినా తీస్తాడనేలా.. కామెంట్స్‌కి కారణమైంది. ఇక వర్మ చేసిన కామెంట్స్ .. అందులో ఉన్న విషయం ఏమిటో ఓ లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: