శర్వానంద్ "ఒకే ఒక జీవితం" మూవీ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శర్వానంద్ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్ "ఒకే ఒక జీవితం" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి యువ దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించగా , అందాల ముద్దు గుమ్మ రీతు వర్మ ఈ మూవీ లో శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , ప్రియదర్శి ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించారు.

మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన ఒకే ఒక జీవితం మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ని తెచ్చుకొని ,  మంచి కలెక్షన్ లను కూడా రాబట్టి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం మూవీ మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.  ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వచ్చేసింది. ఒకే ఒక జీవితం మూవీ ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సోనీ లీవ్ "ఓ టి టి"  సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: