రచ్చ రవి వాడే కారు ఎంతో తెలుసా..!!

murali krishna
మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు వెండితెర సెలబ్రిటీలు  కూడా పెద్ద ఎత్తున కార్లను భారీగానే కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా వరకు సెలబ్రేటిలు భారీగా కార్లను కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే హీరోయిన్ కీర్తి సురేష్, నటులు వైవా హర్ష, బిత్తిరి సత్తి, యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ సావిత్రి, జబర్దస్త్ నటి పవిత్ర వంటి వారు దసరా పండుగ కానుకగా కొత్త కార్లు కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ జాబితాలోకి తాజాగా మరొక్క బుల్లితెర కమెడియన్ కూడా చేరారు.

అతన మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రచ్చ రవి. జబర్దస్త్ షో ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రచ్చ రవి వెండితెర పై పలు సినిమాలలో కూడా ఆయన నటించాడు. అయితే ప్రస్తుతం రచ్చ రవి జబర్దస్త్ స్టేజ్ లో కనిపించడం లేదు కానీ ఒకప్పుడు తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులు నవ్విస్తూ వచ్చాడు. తర్వాత రచ్చ రవి కొన్ని కారణాలవల్ల జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.ఇక జబర్దస్త్ షోలో ఒకప్పుడు రచ్చ రవి చమ్మక్ చంద్ర టీం లో చేస్తూ ఒక స్కిట్లో భాగంగా తీసుకోలేదా రెండు లక్షల కట్నం అనే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దసరా పండుగ సందర్భంగా రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని రచ్చరవినే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రచ్చ రవి కారు తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇన్ని సంవత్సరాలపాటు నాకు మద్దతుగా నిలుస్తూ నన్ను ఆదరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు అని రాసుకొచ్చారు రచ్చ రవి. ఇకపోతే రచ్చ రవి కొనుగోలు చేసిన ఆ కారు వివరాల విషయానికి వస్తే దాన్ని ఫీచర్ లను బట్టి ఆ కారు దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని  మనకు తెలుస్తోంది. ఇకపోతే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అభిమానులు రచ్చ రవి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంటా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: