హీరో సూర్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ మూవీకి సీక్వెల్ రాబోతుందా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూర్య ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సూర్య తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీvలో కూడా అద్భుతమైన మార్కెట్ నీ సృష్టించుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూర్య కెరియర్ లో గజినీ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. గజినీ మూవీ తోనే సూర్య తెలుగు లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

గజినీ మూవీ అటు తమిళ్ ... ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీ లోనూ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ సూర్యvకి కూడా అద్భుతమైన గుర్తింపుvను తీసుకువచ్చింది. ఈ మూవీ కి మురుగదాస్ దర్శకత్వం వహించగా ,  ఆసిన్ , నయన తార ఈ మూవీcలో హీరోయిన్ లుగా నటించారు. ఇలా అప్పట్లో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న గజిని మూవీ కి సీక్వెల్ గా గజిని 2 మూవీ ని తెరకెక్కించాలని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు మురుగదాస్ "గజినీ" పార్ట్ 2 కి సంబంధించిన స్టోరీ ని తయారు చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతా కుదిరితే మరి కొన్ని రోజుల్లోనే మురుగదాస్ "గజిని పార్ట్ 2" కి కథను సిద్ధం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.  అదే జరిగితే సూర్య , మురుగదాస్ కాంబినేషన్ లో గజిని పార్ట్ 2 మూవీ రాబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: