విజయ్ హీరోయిన్ ని చూసి ముఖం తిప్పుకున్న ఆర్యన్ ఖాన్.. ఏమైందంటే..?

Divya
తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా..  అనన్య పాండే హీరోయిన్ గా  తెరకెక్కిన చిత్రం లైగర్. అయితే ఈ డిజాస్టర్ పాలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇండస్ట్రీలోకి రాకముందే అందరికీ పరిచయిస్తుడయ్యాడు. నిజానికి గత ఏడాది డ్రగ్స్ కేసులో భాగంగా అధికారులకు పట్టుబడిన ఆర్యన్ ఖాన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు అని చెప్పాలి.  ఇకపోతే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్... బాలీవుడ్ నటి అనన్య పాండే ఇద్దరు కూడా మంచి స్నేహితుల అన్న విషయం తెలిసిందే.
ఇక అలాగే ఆర్యన్ ఖాన్ కి కూడా అనన్య పాండే తో మంచి స్నేహబంధం ఉంది. ఇకపోతే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు ఈ వివాదంలో అనన్య పాండే పేరు కూడా వినిపించింది. ఇక ఇలా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఇకపోతే బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నటించిన మాజమా సినిమా అక్టోబర్ 6 వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఈ సినిమాను ఒక మాల్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఇక దీనిని చూడడానికి అనన్య పాండే తో పాటు ఆర్యన్ ఖాన్ కూడా వచ్చారు. ఇదిలా ఉండగా ఎంతో మంచి స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడగా ఆర్యన్ ఖాన్ మాత్రం అనన్య పాండేను చూసి చూడనట్టు మొహం పక్కకు తిప్పుకొని వెళ్లిపోయారు.
ఇక ఈ విషయం చూసిన ఎంతో మంది నెటిజన్ లు అయ్యో అనన్య పాండే పరిస్థితి ఏంటి ఇలా అయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: