ఓటిటి లో కూడా అదరగొడుతున్న కార్తికేయ 2 ... 48 గంటల్లో అన్ని స్ట్రీమింగ్ మినిట్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తరికెక్కింది.
 

ఇలా కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో విడుదల అయిన కార్తికేయ 2 మూవీ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన కార్తికేయ 2 మూవీ అక్టోబర్ 5 వ తేదీ నుండి ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రస్తుతం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోతుంది.  కార్తికేయ 2 మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 48 గంటల్లోనే 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు జీ 5 "ఓ టి టి" సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఇలా కార్తికేయ 2 మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: