కార్తీకేయ డైరెక్టర్ నెక్స్ట్...పాన్ ఇండియా ప్రాజెక్ట్, షాకింగ్ డిటైల్స్...!!

murali krishna
నాగచైతన్యతో కలిసి చందు మొండేటి చేసిన భారీ సినిమా సవ్యసాచి ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులకు ముందుకు వచ్చి విఫలం అయింది. దాంతో కొంత టైమ్ తీసుకొని చందు ఇప్పుడు కార్తికేయ రెండవ భాగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అదిరిపోయే స్క్రిప్టు, విజువల్స్ తో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో బాగా ఆడింది. హిందీలో ఊహకు అందని వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా విడుదలై.. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా, రోజు రోజుకీ థియేటర్లకు పెంచుకొంటూ వెళ్లి, వసూళ్లతో దుమ్ము రేపింది. దాంతో ఈ దర్శకుడు హాట్ ప్రాపర్టీగా మారిపోయారు. ఈ దర్శకుడు తో సినిమా చేసే విధంగా హీరోలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చందు మొండేటి తదుపరి చిత్రం పై అందరి దృష్టీ పడింది.
అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు చందూ ... గీతా ఆర్ట్స్ కు సైన్ చేసారు. అలాగే అది ఏకంగా పాన్ ఇండియా సినిమానే అని తెలుస్తోంది. అలాగే ఈ పాన్ ఇండియా సినిమాని ఈ సారి మిడిల్ రేంజ్ హీరోలతో చేయటం లేదు. ఓ పెద్ద స్టార్ తో అప్రోచ్ అయి, ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని గీతా ఆర్ట్స్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి హీరోని ఎంచుకునే అవకాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే గీతా ఆర్ట్స్‌ ఈ కథని ఓకే చేసేసింది. ఇక హీరో చేత ఓకే చేయించటమే తరువాయి. స్క్రిప్టుగా పూర్తయ్యే సరికి హీరో ఎవరన్నది తేలిపోతుంది. గీతా ఆర్ట్స్ ..ప్రస్తుతం ఈ స్క్రిప్టుని ఓకే చేసే బాలీవుడ్ స్టార్ ని వెతికే పనిలో ఉందని సమాచారం.
ఇక టాలెంటు ఉన్న దర్శకులను ఆదరించడం గీతా ఆర్ట్స్ కు అలవాటే. ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉంటుందో ఎవరైతే వరుసగా విజయాలను అందిస్తూ ఉంటారో వారిని ఓడిసిపట్టి తమ సినిమాలను చేయవలసిందిగా వారికి భారీ భారీ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు హీరోలు పెద్దపీట వేస్తున్నారు. అలాంటి సినిమాలు చేసే దర్శకులను ఏరుకోరి మరి తమ సినిమాలకు దర్శకులుగా ఎంచుకుంటున్నారు. ఆ విధంగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన దర్శకుడైన చందు మొండేటి ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: