మరో సూపర్ హిట్ చిత్రం వస్తున్న నరేష్.!!

murali krishna
కొంతకాలంగా సరైన హిట్స్ లేని అల్లరి నరేష్ కు నాంది చిత్రం తో సూపర్ హిట్ అయ్యి..నరేష్ సినీ కెరియర్ కు ఊపిరి పోసింది.విజయ్ కనకమేడల  లో డైరెక్షన్లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించి..నరేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టింది.
ప్రస్తుతం మళ్లీ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న నరేష్..'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, అల్లరి నరేష్
మారేడుమిల్లి ఫారెస్టు నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మిస్తుండగా, ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించారు, ఈ సినిమా కి తాజాగా నవంబర్ 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపిన మేకర్స్..తాజాగా చిత్రంలోని లిరికల్ సాంగ్ ను కూడా విడుదల చేసారు. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ సాంగ్ ని రిలీజ్ చేయించారు. ' నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా.. నా చేతి గీతలో కొత్త రేఖవై నావా' అంటూ ఈ పాట కోన సాగుతోంది. శ్రీమణి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు. ఈ పాటలో హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయి గా మారి.
ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి' .. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు, అంతే కాకుండా నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రం మీకు తప్పకుండా నచ్చుతుది
అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: