బిగ్ బాస్ షో నుంచి ఈ వారం బయటకు వచ్చేది ఆమె..!!

murali krishna
బిగ్ బాస్ సీజన్ 6 లో నాల్గవ వారం హౌస్ నుంచి ఆరోహి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఆదివారం ఎపిసోడ్ లో తేలాల్సిన ఎలిమినేషన్ గురించి ముందే లీక్ అవడంతో ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరో తెలిసిపోతున్నది
ఇస్మార్ట్ న్యూస్ తో పాపులర్ అయిన అంజలి అలియాస్ ఆరోహి ఈరోజు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చింది. హౌస్ లో ఆట మీద కన్నా సూర్యతో పులిహోర కలపడంలోనే చాలా బిజీ గా ఉంది ఆరోహి   .అంతేకాదు ఏం చేసినా సరే తనదే కరెక్ట్ అన్న పంథాలో ఆమె ఆట సాగింది. కెప్టెన్ మాట వినకుండా కూడా ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
అయితే ఇదే విషయంలో నాగార్జున  కూడా ఆమెని చాలా సార్లు మందలించాడు. అయినా కూడా ఆరోహి తన ఆట మార్చుకోలేదు. ఫైనల్ గా లాస్ట్ వీక్ నామినేషన్స్ లో పది మందిలో ఆరోహి కూడా ఉంది. ఇక ఈవారం ఓటింగ్ లో లీస్ట్ పర్సెంటేజ్ వచ్చిన హౌస్ మెట్ గా ఆరోహి బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.సూర్యతో క్లోజ్ గా ఉన్నా ఆమె తన ఆటని తాను ఆడుకుంటే ఇంకా కొద్దిరోజులు ఉండేది. తన వాయిస్ పవర్ ని అవసరమైన ఆట విషయంలో ఉపయోగిస్తే బాగుండేది కానీ ఆరోహి అనవసరమైన విషయాల్లో తన వాయిస్ ని వినిపించింది. అందుకే ఆరోహి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

ఆరోహి బిగ్ బాస్ హౌస్ నుంచి రావడంతో సూర్య ఆట తీరు మెరుగు పడే అవకాశం ఉంది. హౌజ్ లో సూర్య, ఆరోహి ఎమోషనల్ బాండ్ వారి మధ్య సీరియస్ రిలేషన్ షిప్ కి దారి తీసిందని బయట టాక్ వచ్చింది. ఫైనల్ గా ఆరోహి మాత్రం తన అసలైన ఆట ఆడకుండానే వెనుతిరిగిందని చెప్పొచ్చు. మరి ఎలిమినేట్ అయినా ఆరోహి తన గురించి తాను ఎలా విశ్లేషించుకుంటుందో చూడాలి. అయితే బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం ఆరోహి ఎలిమినేషన్ కరెక్ట్ అని భావిస్తున్నారు. ఈమె వల్ల సూర్య ఆట కూడా పాడవుతుందని అంటున్నారు. మరి ఆరోహి ఎగ్జిట్ అయ్యింది కాబట్టి సూర్య ఆట మారుతుందా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: