ఈ వారం 'ఓటిటి' లో విడుదలకు సిద్ధంగా ఉన్న మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి రెడీగా ఉన్నా మూవీ ల గురించి తెలుసుకుందాం. నిఖిల్ హీరోగా చందు మండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 మూవీ తేరకెక్కిన విషయం మన అందరికీ తెలిసింది.

ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా వైవా హర్ష ,  శ్రీనివాస్ రెడ్డి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి. 100 కు పైగా కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ ని ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అక్టోబర్ 5 వ తేదీ నుండి తెలుగు ,  తమిళ  ,  హిందీ భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది.  గాలిపాట 2 మూవీ కన్నడ భాషలో జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అక్టోబర్ 5 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తలకెక్కిన హిందీ సినిమా రక్షా బంధన్ అక్టోబర్ 5 వ తేదీ నుండి జీ ఫైవ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో హిందీ భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈషో మూవీ సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో అక్టోబర్ 5 వ తేదీ నుండి మలయాళం , తెలుగు , తమిళ ,  కన్నడ , హిందీ భాషల్లో సిరిమింగ్ కాబోతుంది. ఉనికి మూవీ అక్టోబర్ 5 వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో తెలుగు లో స్ట్రీమింగ్ కాబోతుంది. దర్జా మూవీ ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 5 వ తేదీ నుండి తెలుగు లో స్ట్రీమింగ్ కాబోతుంది.  మజా మా మూవీ అక్టోబర్ 6 వ తేదీన హిందీ భాషలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఓరు తెక్కన్ తల్లా కేస్ మూవీ నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 6 వ తేదీ నుండి మలయాళం , తెలుగు , తమిళ ,  కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: