వైరల్ అవుతున్న ఆదిపురుష్ లుక్...!!

murali krishna
ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరికెక్కిన ఆది పురుష్ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా నేడు ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.


ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్, ప్రభాస్ అభిమానుల మధ్య వార్ కి దారి తీసింది. ఇదివరకే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటించి న సంగతి మనకు తెలిసిందే.


ఈ క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్ చిత్రం లో కూడా రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే వీధిద్దరి రాముడి లుక్ కి సంబంధించిన పోస్టర్ల ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇద్దరి మధ్య పోలికల ను పెడుతున్నారు. మా హీరో రాముడిగా అద్భుతంగా ఉన్నారంటే మా హీరో అద్భుతం గా ఉన్నారంటూ అభిమానుల మధ్య  వార్ మొదలైంది.రామ్ చరణ్ అభిమానులు అల్లూరి సీతారామరాజు గెటప్ లు రామ్ చరణ్ ఎంతో అద్భుతం గా ఉన్నారంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ప్రభాస్ రాముడి లుక్ పై కామెంట్లు కూడా చేస్తున్నారు.


అదేవిధంగా ప్రభాస్ అభిమాను లు సైతం రామ్ చరణ్ లుక్ పై కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు రాముడి పాత్రలలో నటించడం తో ఇరువురి అభిమానుల మధ్య మరోసారి మాట ల యుద్ధం నడుస్తోంది. అయితే ఆది పురుష్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద ల చేయడం తో ప్రభాస్ అభిమానులు సైతం తన ఫస్ట్ లుక్ విషయంలో కాస్త అసంతృప్తికి లోనయ్యార ని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తం గా 2023 సంక్రాంతి కానుక గా జనవరి 12వ తేదీ విడుదల కానుందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: