ధనుష్ 'నేనే వస్తున్నా' మూవీ డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ధనుష్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ని సంపాదించు కున్నాడు. 
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన తిరు మూవీ తో ధనుష్ తమిళ ,  తెలుగు ఇండస్ట్రీబిలో రెండింటిలో కూడా అద్భుతమైన విజయాన్ని అందికున్నాడు.

తాజాగా ధనుష్ 'నేనే వస్తున్నా' అనే మూవీ లో హీరో గా నటించాడు. సెల్వ రాఘవన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిన్న అనగా సెప్టెంబర్ 29 వ తేదీన తమిళ్ మరియు తెలుగు భాషలో విడుదల అయింది. ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ టాక్ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లాలి4 విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేనే వస్తున్నా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ  'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ,  కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: