ఆదిపురుష్ : రేపు కీలక అప్డేట్.. ఏంటో?

Purushottham Vinay
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఇంకా అలాగే ఇతర హీరోల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్. బాహుబలి తరువాత ఆ రేంజ్ హిట్ ఈ సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 2వ తేదీన టీజర్ విడుదల కాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా అయితే క్లారిటీ రాలేదు. రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు అధికారికంగా టీజర్ ప్రకటన రాబోతుంది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రకటన మొదలుకుని ప్రతి విషయాన్ని కూడా దర్శకుడు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు సమయం పెట్టుకుని మరీ విడుదల చేస్తున్నాడు.


ఆ సమయం  ప్రాముఖ్యత ఏంటో కానీ మళ్లీ అదే సమయంకు రేపు టీజర్ అఫిషియల్ పోస్టర్ రాబోతుంది.అయితే ఆదిపురుష్ టీజర్ పై ఎన్నో రకాల అంచనాలు ఉన్నాయి. అయోధ్య లో యూపీ సీఎం యోగి ఆధిత్య నాథ్ చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. అయోధ్య లో జరుగబోతున్న ఈవెంట్ లో ప్రభాస్ పాల్గొంటాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా.. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇంకా ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సినిమాలో నటించారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ రామాయణ ఎపిక్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: