రాజమౌళి - అల్లు అరవింద్ మధ్య విభేదాలు రావడానికి కారణమేంటో తెలుసా...?

Anilkumar
టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నిర్మాతగా అల్లు అరవింద్ కూడా ఎన్నో సినిమాలకు వ్యవహరించారు.రాజమౌళి, అల్లు అరవింద్ కాంబినేషన్లో వచ్చిన మగధీర చిత్రం ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయారు. రాజమౌళి ఆ తర్వాత ఎలాంటి సినిమా చేసినా సరే టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఎదురుచూసేవారు. అయితే  తెలుగు ఇండస్ట్రీలోనే ఇప్పటివరకు ఒక ప్లాప్ కూడా పడని డైరెక్టర్ ఎవరంటే కచ్చితంగా రాజమౌళి పేరు వినిపిస్తుందని చెప్పవచ్చు.

ఇక ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మగధీర సినిమాని తెరకెక్కించారు.అయితే  ఈ చిత్రానికి నిర్మాతగా అల్లు అరవింద్ వ్యవహరించారు. అంతే కాకుండా చిరంజీవి కుటుంబం ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలా ఇబ్బందులు ఉన్న సమయంలో ఈ చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పవచ్చు.ఇకపోతే  మగధీర సినిమా పలు రికార్డులను సైతం సృష్టించిందని చెప్పవచ్చు.ఈ సినిమా క్రెడిట్ విషయంలో మాత్రం డైరెక్టర్ నిర్మాత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని వార్తలు కూడా వినిపించాయి.

ఇక అందుకు కారణం ఏమిటంటే అల్లు అరవింద్ ఈ సినిమా విడుదలైన తర్వాత రాజమౌళిని పక్కకు పెట్టేసారని వార్తలు వినిపించాయి. అయితే ఇక  అలా ఎందుకు జరిగింది అంటే.. మగధీర చిత్రం 50 రోజులు, 100 రోజులు , 175 రోజులు పలు సెంటర్లలో ఆడిందనే విషయం అభిమానుల మధ్య గట్టి పోటీ ఉండడంతో ఇందులో కొన్ని ఫేక్ రికార్డులు చూపించారని వార్తలు కూడా వినిపించాయి. రాజమౌళి మాత్రం మగధీర సినిమా విషయంలో ఇలాంటివి అసలు వద్దని కూడా అల్లు అరవింద్ కి చెప్పాడట. అయితే అందుకు అల్లు అరవింద్ కూడా ఓకే అని చెప్పారు..ఇక  సినిమా విడుదలైన తర్వాత సెంటర్లలో ఇలాంటి ప్రచారం చేయడంతో.. రాజమౌళికి నచ్చక అప్పటినుంచి అల్లు అరవింద్ రాజమౌళి మధ్య మాటల్లేవ్ అన్నట్టుగా సమాచారం. అయితే ఇక  ఈ చిత్రం విడుదలైన నెల రోజులకు తమిళంలో విడుదల చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: