సామ్ కు పోటీగా అల్లు శిరీష్?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన 'శాకుంతలం' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమవుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం.నవంబర్ 4 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రుద్రమదేవి' సినిమా తరువాత దర్శకుడు గుణశేఖర్ చాలా గ్యాప్ ని తీసుకొని భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వనుంది.అయితే ఇప్పుడు ఈ సినిమాతో పోటీగా అల్లు శిరీష్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. చాలా కాలంగా శిరీష్ నటించిన 'ప్రేమ కాదంట' సినిమా పెండింగ్ లో ఉంది. ఎట్టకేలకు ఈ సినిమాను నవంబర్ 4న రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట దర్శక నిర్మాతలు.


ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా 'ప్యార్ ప్రేమ కాదల్'కు అఫీషియల్ రీమేక్. గీతాఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించినప్పటికీ..సినిమా రిలీజ్ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఫైనల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే సమంత సినిమాతో పోటీగా దింపడం చర్చనీయాంశంగా మారింది. అసలే అల్లు శిరీష్ ట్రాక్ రికార్డ్ పెద్దగా బాలేదు. ఇలాంటి సమయంలో 'శాకుంతలం' లాంటి భారీ ప్రాజెక్ట్ తో పోటీ అంటే రిస్క్ అనే చెప్పాలి.మరి ఈ అల్లు వారి కుర్ర హీరో ఈ రిస్క్ తీసుకొని ధైర్యంగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకొస్తారో..? లేదంటే సైడ్ అయిపోతారో అనేది చూడాలి. ప్రస్తుతానికైతే రిలీజ్ డేట్ విషయంలో ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: