వామ్మో:సమంతతో పోటీకి దిగుతున్న అల్లు శిరీష్...!!

Divya
సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. చాలా కాలం అవుతున్నది ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బంధం ప్రకటించడం జరిగింది. రుద్రమదేవి సినిమా తర్వాత డైరెక్టర్ గుణశేఖర్ చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఈ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా పారాణిక నేపథ్యంలో రూపొందించడం జరిగింద. ఈ సినిమాకి సంగీతాన్ని మణిరత్నం అందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా టాలీవుడ్లోకి చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా అల్లు శిరీష్ నటించిన ప్రేమ కాదంట అనే సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు కూడా అవుతొంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో పలు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇందులో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రానికి దర్శకుడుగా రాకేష్ చేసి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను  కూడా తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన ప్యార్ ప్రేమ కథాల్ అనే సినిమా రీమిక్ అన్నట్లుగా తెలుస్తోంది.

అయితే అల్లు శిరీష్ సమంత పోటి దింపడం వెనుక ఇండస్ట్రీలో ఈ  అంశం చర్చకు దారితీస్తోంది ఈ సినిమా. ఇక అల్లు శిరీష్ గత సినిమాల పరంగా చూసుకుంటే ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏంటివి లేవని చెప్పవచ్చు.ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. మరి వీరిద్దరిలో ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాలి అంటే నవంబర్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. లేదంటే డేట్ లో విషయంలో ఎవరో ఒకరు అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: