తెలుగు... తమిళ భాషలలో వరస అవకాశాలతో దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి..!

Pulgam Srinivas
మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీనాక్షి చౌదరి 2018 లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ సుశాంత్ హీరోగా తెరకెక్కన ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీ తో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది.  

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ అందచందాలకు , నటనకు మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దానితో ఈ ముద్దు గుమ్మ కు మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కింది  ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ అందచందాలతో కుర్రకారును ఫీదా చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లో అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 2 మూవీ లో నటించింది. ఈ మూవీ ని నాని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నారు.  హిట్ 2 మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీనాక్షి చౌదరి తమిళ్ లో కొలై అనే మూవీ లో నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తన కెరియర్ ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: