కండక్టర్ ఝాన్సీ భాధ వెనుక ఇంత గాథ ఉందా?

Satvika
కండక్టర్ ఝాన్సీ.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మార్మోగిపోతూనే ఉంది. ఎక్కడో రికార్డులు డ్యాన్సులు వేసుకుంటూ ఉండే కండక్టర్ ఝాన్సీ..ఇప్పుడు బుల్లితెరపై ఓ సెన్సేషన్. పల్సర్ బైక్ పాట, ఝాన్సీ స్టెప్పులు రెండూ తెలియని వాళ్లు ఎవ్వరూ లేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పల్సర్ బైక్ పాట మార్మోగిపోతోంది. ఇక కండక్టర్ ఝాన్సీ వేసిన మూమెంట్స్ అందరినీ అలరిస్తూనే ఉన్నాయి. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎప్పుడైతే పల్సర్ బైక్ పర్ఫామెన్స్‌కు సంబంధించిన ప్రోమో వచ్చిందో..


అందులో గాజువాక డిపో కండెక్టర్ అని చెప్పిందో.. అప్పటి నుంచి ఝాన్సీ పేరు మార్మోగిపోతూనే ఉంది. ఆ తరువాత ఝాన్సీ ఇది వరకు చేసిన డ్యాన్స్ వీడియోలు, రికార్డింగ్ డ్యాన్స్ వీడియోలు కోకొల్లలుగా నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆమె స్టెప్పులు ఎక్కడో చోట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆమె తన జీవితంలోని విషాద ఘటనలు, అవమానపడ్డ క్షణాలను చాలానే చెప్పుకొచ్చింది..ఆమె డ్యాన్స్ వెనుక ఎన్నో భాధలు వున్నట్లు చెప్పింది..

ఒకప్పుడు అందరూ ఎగతాళి చేసేవారని, పరువుతీస్తున్నావని అనేవారట. ఇలా డ్యాన్సులు చేసుకుంటూ పరువంతా తీస్తున్నావని బందువులు అనేవారట. కానీ తాను కష్టపడి తన తమ్ముడిని కూడా చదివించుకున్నాని అంటుంది ఝాన్సీ. ఇక తాజాగా జబర్దస్త్ స్టేజ్ మీదా ఝాన్సీ మెరిసింది. ఇంత వరకు తమను అవమానించిన వారే ఫోన్ చేసి.. మా పరువు నిలబెట్టావ్ అని ఫోన్ చేస్తున్నారు అని చెబుతూ స్టేజ్ మీదే కుప్పకూలిపోయి ఎమోషనల్ అయింది. స్టేజ్‌కు ప్రేమగా నమస్కరించేసింది..ఆమె డ్యాన్స్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు..ఆమె డ్యాన్స్ కు మెచ్చి హీరో సంపూర్ణేష్ బాబు సినిమాలో ఛాన్స్ ఇచ్చారు..మొత్తానికి ఒక్క డ్యాన్స్ తో సెలెబ్రేటి అయ్యింది..ఇక ముందు ఆమెను పట్టుకోవడం ఎవరి వల్ల కాదు..అతి తక్కువ సమయంలోనే సెలెబ్రేటి అయ్యింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: