బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' మూవీ స్పెషల్ షో లకు ఆ దేశంలో అదిరిపోయే క్రేజ్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇది ఇలా ఉంటే నందమూరి బాలకృష్ణ , వి వి వినాయక్ దర్శకత్వం లో చెన్నకేశవ రెడ్డి అనే మూవీలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిం దే. ఈ మూవీ 25 సెప్టెంబర్ 2002 వ తేదీన భారీ అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ లు ,  అలాగే బాలకృష్ణ చేసిన ఫైట్ లు మరియు పాటలలో బాలకృష్ణ వేసిన స్టెప్ లు అన్నీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని అందించగా ,  శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు.

ఈ మూవీ లో  టాబు ,  శ్రియా ,  జయప్రకాశ్ రెడ్డి , దేవయాని (నటి) , చలపతి రావు , ఆహుతి ప్రసాద్ , రఘుబాబు , బ్రహ్మానందం , ఆలీ , ఎల్. బి. శ్రీరాం ,ఎమ్మెస్ నారాయణ , వేణుమాధవ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన బుకింగ్ లను కూడా కొన్ని ప్రాంతాలలో తెరిచారు. అందులో భాగంగా చెన్నకేశవ రెడ్డి మూవీ బుకింగ్ లను ఆస్ట్రేలియాలో 4 షో లకు ఓపెన్ చేయగా 524 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా చెన్నకేశవ రెడ్డి సినిమా ఆస్ట్రేలియా లో ఫుల్ జోష్ ని చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: