టాలీవుడ్ కి కొత్త విలన్ గా మాజీ హీరో.. రంగం సిద్ధం చేసిన స్టార్ డైరెక్టర్..?

Anilkumar
టాలీవుడ్ తెలుగు సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నట వారసులుగా ఇద్దరు కుమారులు హీరోలుగా రంగ ప్రవేశం చేశారు.ఇకపోతే పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ హీరోగా నిలదొక్కు కోవడానికి అనేక ఇబ్బందులు పడినా చిన్న కుమారుడు అల్లరి నరేష్ మాత్రం ఒకరకంగా హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆర్యన్ రాజేష్ కు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ఆయన తెలుగు సినీ పరిశ్రమకు కాస్త దూరమయ్యాడు. ఈయన దూరమయ్యాడు అనడం కంటే చాలా గాప్ ఇచ్చాడనే చెప్పాలి. 

ఇక 2012వ సంవత్సరంలో బాలరాజు ఆడి బామ్మర్ది అనే తెలుగు సినిమా చేసిన ఆయన ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకుని తమిళంలో ఒక సినిమా చేశారు.  అయితే ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమాలో రామ్ చరణ్ సోదరుడిగా నటించారు. ఈ సినిమాలో ఆయన విలన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందన్నమాట.అది అయితే నిజం కాలేదు, ఆ సినిమాలో రామ్ చరణ్ సోదరుడి పాత్రలో ఆర్యన్ రాజేష్ నటించారు.ఇక  ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్యన్ రాజేష్ విలన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే  ఒక బడా డైరెక్టర్ ఆర్యన్ రాజేష్ ను విలన్ గా పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ఇక  నిజానికి ఆర్యన్ రాజేష్ ఈ మధ్యనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇకపోతే మెగా డాటర్ నిహారిక నిర్మాణంలో రూపొందిన హలో వరల్డ్ అనే ఒక వెబ్ సిరీస్ లో ఒక ఐటీ ఉద్యోగి పాత్రలో ఆర్యన్ రాజేష్ కనిపించారు.అయితే ఇప్పుడు ఒక బడా డైరెక్టర్ పుణ్యమా అని ఆయన మరోసారి పూర్తిస్థాయిగా సినిమాల మీద దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.  ఆయనను విలన్ గా పరిచయం చేసేందుకు సదరు డైరెక్టర్ ఇప్పటికే అంతా సిద్ధం చేశారని ఆర్యన్ రాజేష్ కు కథ కూడా చెప్పారని ఆ కథ కూడా ఆర్యన్ రాజేష్ కు బాగా నచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం అధికారికంగా ఆర్యన్ రాజేష్ ప్రకటిస్తే గాని ఎలాంటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. చూడాలి ఎప్పుడు ప్రేక్షకులకు ముందుకు ఈ విషయాలు తీసుకు వస్తున్నారనేది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: