ఇండియన్ -2 లో న్యూ లుక్ లో కనబడునున్న...... ' కమల్'....!!

murali krishna
కమల్ హాసన్‌, శంకర్ కాంబినేషన్ సినిమా అంటే భారతీయుడు గుర్తుకు వస్తుంది. ఆ సినిమా భారతీయ చలనచిత్రరంగాన్ని కుదిపేసింది. భారతీయుడు 1996 లో ఎస్.శంకర్ దర్శకత్వంలో విడుదలైన తమిళ సినిమా. కమల్ హాసన్, మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఎ.ఆర్. రెహ్మాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత మరలా వీరి కాంబినేషన్‌లో సీక్వెల్ వస్తుందని వార్తలు వచ్చాయి. మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. తాజాగా విక్రమ్ సినిమా కమల్‌హాసన్ నటించిన చిత్రం బాక్సీఫీస్‌ను షేక్ చేసేసింది. దాంతో కమల్‌కు పూర్తి ధైర్యం రావడం, అంతకుముందు శంకర్‌తో వున్న చిన్నపాటి manaస్పర్థలు తీరిపోవడం జరిగింది.
అయితే, మంగళవారంనాడు ఇండియన్‌2 (భారతీయుడు2) చిత్రం షూటింగ్ షురూ అయిందని తెలుస్తోంది. చెన్నైలో ఓ స్టూడియోలో నిర్మాతలను కమల్‌హాసన్ కలిసి మాట్లాడడం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్‌2 అధికారిక సోషల్‌మీడియాలో - కమల్ సార్ ఇండియన్2 లుక్ ఇదంటూ చూపించారు. మీసాలు తిప్పి పసుపు చొక్కాతో అందరినీ పలుకరిస్తూ, 70లో మీరు ఎలా కనిపించేవారో అంటూ వారితో సరదాగా మాట్లాడిన విషయాలు ఆసక్తిగా మారాయి. ఈరోజు నుండి షూటింగ్ పునఃప్రారంభం అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈరోజు ప్రారంభమైన ఈ సినిమా షూట్‌లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ పార్ట్ షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దర్శకుడు శంకర్ RC15 షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
లోక నాయకుడుకమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. కమల్ హాసన్ సినిమాలు విభిన్నంగా ఉంటాయి.. కమర్షియల్ హిట్ సాధించక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.
అయితే ఈయన గత కొన్నేళ్లుగా హిట్ లేక బాధ పడుతున్న సమయంలో విక్రమ్ రూపంలో హిట్ వచ్చింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇచ్చిన విజయాన్ని అలాగే కొనసాగించాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. విక్రమ్ హిట్ తో ఎప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 ఇప్పుడు రీస్టార్ట్ చేసారు..విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ 2.1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అవ్వగా శరవేగంగా జరుగుతుంది.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇక ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది.
ఈయన కోర మీసంతో గడ్డం లేకుండా కొత్త లుక్ లోకి ఈయన మారిపోయాడు.. దీనితో ఈ కొత్త లుక్ ఇండియా 2 కోసమే అని ఈ లుక్ తోనే ఈయన సెట్స్ లో జాయిన్ అయ్యాడని కన్ఫర్మ్ అయ్యింది.. ఈ లుక్ ఇప్పుడు నెట్టింట బాగా షేర్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: