ప్రేమ పేరుతో ఆ స్టార్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిన నివేదా థామస్..!!

Anilkumar
నివేదా థామస్ నేచురల్ యాక్టింగ్ తో సూపర్ హిట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అన్నమాట.అయితే  నిజానికి ఈమె ఎక్కువగా తెలుగు , తమిళ్ , మలయాళం సినిమాల్లో నటించి మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే 2002లో మలయాళం చిత్రం ఉత్తర సినిమా ద్వారా బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్.. మై డియర్ భూతంలో కూడా నటించింది.అయితే  ఆ తర్వాత మలయాళం సినిమా వెరుతే ఒరు భార్య. అయితే అనే సినిమాలో జయరాం కుమార్తెగా నటించి సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రంలో విమర్శకుల నుండి కూడా ప్రశంసల లభించాయి. అంతేకాదు ఇక  ఈ సినిమాలో తన నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం కూడా అందుకుంది. ఆ తర్వాత తమిళ్ , మలయాళం చిత్రాలలో సహాయనటిగా నటించింది. 

తెలుగులో ఈమె చేసిన మొదటి సినిమా జెంటిల్మెన్.. ఈ సినిమాతో కూడా మంచి ప్రశంసలు అందుకుంది నివేదా..ఇకపోతే ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సురభి , నివేదా థామస్ నటించిన చిత్రం జెంటిల్మెన్ .ఇక  2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో ఈమె ఎన్నో సినిమాలలో నటించింది.కాగా  అందులో కొన్ని విజయం సాధించగా మరికొన్ని ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే అయినా కూడా ప్రతి సినిమాలో కూడా ఆమె నటనను మెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఇదిలావుంటే ఇటీవల ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..అయితే  ఒక మలయాళం యంగ్ హీరోని కెరియర్ మొదట్లో నివేదా థామస్ ప్రేమించిందని , అతడిని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని మీడియాలో వార్తలు రావడం జరిగింది.

అయితే ఇక  అప్పటికే జెంటిల్మెన్ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన నివేదా థామస్ గురించి ఈ వార్త బయటకు రావడంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చెక్కర్లు కొట్టింది. అతడిది వేరే క్యాస్ట్ కావడంతో ఈమెది వేరే కాస్ట్ కావడంతో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అంతేకాదు ఇక  నివేదా ఇంట్లో వాళ్ళు నువ్వు కానీ అతడిని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకుంటామని బెదిరించడంతో నివేదా కూడా ప్రేమ కన్నా పేరెంట్స్ ముఖ్యమని అతని ప్రేమను వదులుకుంది. అయితే ఇక  అతడు మాత్రం వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాడు అన్నట్లు తెలుస్తోంది.సింగిల్ గా ఉంటున్న నివేదా థామస్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టింది.కాగా ఇటీవల ఈమె నటించిన షాకిని డాకిని సినిమా కూడా విడుదల అయ్యి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: