నాగ్ పై వివాదస్పద కామెంట్స్ చేసిన నిర్మాత?

Purushottham Vinay
స్మాల్ స్క్రీన్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో విషయంలో ప్రేక్షకులలో ఎన్నో రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సామాన్య ప్రేక్షకులలో చాలామంది బిగ్ బాస్ షో గురించి ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.సీపీఐ నారాయణ బిగ్ బాస్ షో గురించి చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్, నిర్మాత త్రిపురనేని చిట్టి కూడా బిగ్ బాస్ షోపై షాకింగ్ కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో విషయంలో సీపీఐ నారాయణ భావం కరెక్ట్ అని అయితే ఆయన వాడిన భాష మాత్రం తప్పు అని చిట్టి చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షోలో జరిగేవన్నీ పబ్లిక్ రొమాన్స్ అవుతాయని ఫ్యామిలీతో కలిసి చూసే షోలో ఇలా చేయడం ముమ్మాటికీ తప్పేనని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి తప్పును నాగార్జునలాంటి వ్యక్తి ప్రోత్సహిస్తున్నాడని త్రిపురనేని చిట్టి కామెంట్లు చేశారు.


బిగ్ బాస్ హౌస్ లో రోహిత్ మెరీనాలను హగ్ చేసుకోవాలని కిస్ చేసుకోవాలని నాగ్ చెబుతున్నారని అలా అయితే పెళ్లైన వాళ్లు పబ్లిక్ గా ఏమైనా చేసుకోవచ్చా అంటూ ఆయన ప్రశ్నించారు.నాగార్జునకు కూడా పెళ్లైందని లైసెన్స్ ఉందని అంత మాత్రాన నాగార్జున భార్యను తీసుకొచ్చి బయట రొమాన్స్ చేస్తాడా అని చిట్టి ప్రశ్నించారు. నలుగురిలోకి వచ్చిన సమయంలో గౌరవంగా ఉండే నాగ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవాళ్లను మాత్రం పబ్లిక్ లో రొమాన్స్ చేసుకోవాలని ఎందుకు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. బిగ్ బాస్ లో అసభ్యత ఉందని ఇలాంటివి తగ్గించని పక్షంలో జనం తిరగబడతారని చిట్టి తెలిపారు.బిగ్ బాస్ తరహా కార్యక్రమాలను బ్యాన్ చేసినా తప్పేం లేదని నారాయణ మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదని చిట్టి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో కొంతమంది చిట్టిని సపోర్ట్ చేస్తున్నారు.బిగ్ బాస్ షోని బ్యాన్ చెయ్యాలని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: