వెంకటేష్... గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్నటు వంటి సీనియర్ హీరో లలో ఒకరు ఆయన విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో హిట్ ,  సూపర్ హిట్ ,  బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగు తున్నాడు. ఇది ఇలా ఉంటే విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఎన్నో గొప్ప మూవీ లు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.

అలా విక్టరీ వెంకటేష్ కెరియర్ లో ఉన్న మంచి మూవీ లలో ఘర్షణ మూవీ ఒకటి. ఈ మూవీ కి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించగా , ఆసిన్ ఈ మూవీ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' అనే మూవీ కి తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ భాషలో సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల కాగా ,  తెలుగు భాషలో సెప్టెంబర్ 17 వ తేదీన విడుదల అయ్యింది.

ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ 'ఘర్షణ 2' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ...  తాజాగా వెంకటేష్ గారిని కలిసాను. ఘర్షణ  2 మూవీ గురించి డిస్కస్ చేశాను అని చెప్పు కొచ్చాడు. దానితో వెంకటేష్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో ఘర్షణ 2 మూవీ వచ్చే అవకాశం మరి కొన్ని రోజుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: