'గాడ్ ఫాదర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. ఎన్ని కోట్లో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో చిరంజీవి అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ఎంతోమందికి సినీ లైఫ్ ఇచ్చారని చెప్పవచ్చు..ఇకపోతే చిరంజీవిని ఇన్స్పైర్గా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఇక  కొన్ని సంవత్సరాలు రాజకీయ ఎంట్రీ ఇచ్చినా కూడా చిరంజీవికి అంతగా కలిసి రాలేకపోవడంతో తిరిగి మళ్ళీ సినిమాల వైపు అడుగులు వేశారు.

 ఇక అలా ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత పలు సినిమాలతో బిజీగా మారిపోయారు.ఇదిలావుంటే  ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక  ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

 ఇకపోతే ఈ సినిమా ఓటీ టీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇక  ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.కాగా  ఈ సినిమాలో నయనతార, సత్య దేవ్ కీలకమైన పాత్ర లో నటిస్తున్నారు. ఇకపోతే  వీరితో పాటే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ , సునీల్ కూడా నటిస్తూ ఉన్నారు. అయితే  చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య భారీ డిజాస్టర్ కావడంతో మెగా అభిమానుల సైతం కాస్త నిరుత్సాహం చెందారు.  ఈ సినిమాతో నైనా చిరంజీవి అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి. కాగా ఈ చిత్రాన్ని కొణిదెల బ్యానర్ పైనే తెరకెక్కించడం జరిగింది..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: