చైతు - సమంత విడిపోడానికి...... సుప్రియ కు సంబంధం ఉందా....??

murali krishna
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని ఇప్పటికే 10 నెలలు అవుతుంది. వారిద్దరి విడాకుల గురించి వదిలేయండి ప్లీజ్.. అని సాక్షాత్తు నాగార్జున వేడుకుంటున్నా మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు మాత్రం చైతు - సమంత విడాకులను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.
చైతు - సమంత బ్రేకప్‌లపై రోజుకో కొత్త స్టోరీలు పుట్టుకు వస్తున్నాయి. చైతు - సమంత విడిపోయిన వాళ్ళ విడాకులకు నిజంగా కారణం ఏంటన్నది ? తెలియకపోవడంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వదిలేస్తున్నారు. దీంతో అది వైరల్ అవుతుంది.
ఇప్పటికే చాలాసార్లు చైతు - సమంత విడిపోవడానికి కారణం తెలిసిపోయింది అంటూ వెబ్సైట్లు, యూట్యూబ్లో వాళ్ళు రకరకాల స్టోరీలు అల్లేశారు. ఇక తాజాగా నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ వల్లే చైతు - సమంత బంధం తెగిపోయింది అని రాసి పారేశారు. దీనికి ఓ అద్భుతమైన కథ కూడా అల్లేశారు. సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు సమంతకు పడదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని సమంత అడ్డుపడిందట. అదే చైతుతో దూరానికి కారణమైందని.. చివరకు వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యేలా చేసిందని రాసుకు వచ్చారు.
సుప్రియ ముందుగా చరణ్ రెడ్డితో ప్రేమలో పడింది. చరణ్ రెడ్డి ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన `ఇష్టం` సినిమాలో హీరోగా నటించాడు. శ్రీయ ఆ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయింది. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చరణ్ దురలవాట్లకు లోనవడంతో అతడికి దూరమైంది. తర్వాత చరణ్ మృతి చెందాడు. చాలా రోజులపాటు అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్గా ఉంటున్న సుప్రియ `గూఢచారి` సినిమాతో తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చింది.
ఆ సమయంలోనే అడవి శేషుతో ఏర్పడిన పరిచయంతో స్నేహితులుగా మారారు. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అన్న ప్రచారం జరగడంతో అడవి శేషు కూడా స్పందించాడు. కొన్నాళ్లు వదిలేయండి బాస్ అంటూ నెటిజన్లను వేడుకున్నాడు. అయితే తమ ప్రేమ పెళ్లి వ్యవహారం పై ఎన్ని వార్తలు వచ్చిన సుప్రియ మాత్రం స్పందించలేదు.. అలాగని ఆమోదించను లేదు. సుప్రియ, నాగచైతన్య చిన్నప్పటి నుంచి మేనమామ, మేనత్త కొడుకులు కావడంతో సన్నిహితంగా ఉండేవారట.
అది కూడా సమంతకు నచ్చేది కాదని అలా సుప్రియతో ఆమెకు ఎక్కడో తెలియని గ్యాప్ వచ్చిందని అంటారు. అందుకే అడవి శేష్‌, సుప్రియ పెళ్ళికి కూడా ఆమె అడ్డుపడిందని.. చైతు ఈ విషయంలో సీరియస్ అవ్వడంతో చివరకు ఆ గ్యాప్‌ పెరిగి పెద్దది అయ్యి, చైతు - సమంత విడాకులకు దారితీస్తుందని రాసుకు వచ్చారు. వాస్తవంగా ఆలోచిస్తే సుప్రియ అడవి శేషు పెళ్ళికి సమంత ఎందుకో అడ్డుపడుతోంది. ఆ మాటకు వస్తే సమంతకు ముందే హీరో సిద్ధార్థతో బ్రేకప్ అయ్యి తర్వాత చైతుతో పెళ్లి జరిగింది. అది కూడా ఓ పెద్ద కథ.
ఆ మాటకు వస్తే దగ్గుపాటి లక్ష్మి, నాగార్జునది కూడా పక్కన వివాహమే. ఆ తర్వాతే నాగార్జున మరో హీరోయిన్ అమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అదే కుటుంబంలో మరో హీరో సుమంత్ నటి కీర్తి రెడ్డి పెళ్లి కూడా కొన్నాళ్లకే పెఠాకులు అయ్యింది. అయితే నాగచైతన్య.. సమంత పెళ్లిపై ఏ వార్త రాసినా చదువుతున్నారు. వ్యూస్ వస్తున్నాయి కదా ? అన్న కోణంలో చాలామంది తమకు ఇష్టం వచ్చినట్టు రోజుకో కథ వండి వార్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సుప్రియను విలన్ గా చూపిస్తూ సరికొత్త కథ అల్లేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: