యష్ నుంచి మరో యాక్షన్ మూవీ?

Purushottham Vinay
ఒకప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ మార్కెట్ వున్న ఇండస్ట్రీ. అయితే కన్నడ హీరోలంటే తెలుగు వాళ్లకి కేవలం ఉపేంద్ర ఒక్కడే తెలిసేవాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకు 'ఈగ'తో కిచ్చా సుదీప్ పరిచయమయ్యాడు. అయితే ఈ ఇద్దరూ కేవలం సౌత్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు.ఇక నార్త్‌ ఆడియన్స్ కి అసలు కన్నడ ఇండస్ట్రీ అనేది ఒకటుందనే చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ‘కేజీఎఫ్‌’తో చరిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ యష్‌. కేజీఎఫ్‌తో కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఖాన్‌, కపూర్‌లను సైతం వెనక్కినెట్టి కలెక్షన్లలో యష్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఈ చిత్రం తర్వాత యష్ ఎలాంటి కథతో రాబోతున్నాడు అని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా యష్ నెక్స్ట్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.యష్ నెక్స్ట్ చిత్రాన్ని ‘మఫ్టీ’ ఫేం నార్తన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్రబృందం త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది.


 కాగా ఈ చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందట. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో గ్రాండియర్‌గా పాన్ ఇండియా లెవల్లో రూపొందనుందట. ఇప్పటికే రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రం కోసం కసరత్తులు ప్రారంభించాడట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనుందని టాక్‌. కేజీఎఫ్ చిత్రం కూడా పీరియాడిక్ యాక్షన్‌ జానర్‌లో తెరకెక్కిన విషయం తెలిసిందే.‘కేజీఎఫ్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో యష్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.1250 కోట్లకు పైగా కలెక్షన్‌లను సాధించి రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావురమేష్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: