కార్తీ 'సర్దార్' మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్నటు వంటి హీరో లలో ఒకరు అయిన కార్తీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కార్తీ నేరుగా ఒక్క తెలుగు సినిమాలో నటించక పోయినప్పటికీ తాను నటించిన ఇతర భాష మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి మార్కెట్ ని కార్తీ క్రియేట్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తీ 'సర్దార్' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కార్తీ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి విశాల్ తో అభిమన్యుడు లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ ని తెరకెక్కించిన పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. జివి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతం అందించగా ,  ఈ మూవీ కి జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫి చేసాడు.  ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ఎస్ లక్ష్మణ్ కుమార్ గ్రాండ్ గా నిర్మించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ విడుదల చేసింది.

ఈ మూవీ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం కొద్ది సేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో కార్తీ డ్యూయల్ రోల్ లో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ లో సిమ్రాన్, రజిష్ విజయన్, మునీష్ కాంత్, చంకీ పాండే, మురళి శర్మ తదితరులు కనిపించనున్నారు. కాగా ఈ మూవీ ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: