ధనుష్ 'నేనే వస్తున్నా' మూవీ తెలుగు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదుm. తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ధనిష్ తాను నటించిన ఎన్నో సినిమా లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సంపాదించు కున్నాడు . ముఖ్యం గా ధనుష్ నటించిన సినిమా లలో రఘువరన్ బీటెక్ , మారి మూవీ లు తెలుగు లో కూడా భారీ విజయాలను అందు కున్నాయి . 

అలాగే ఈ మధ్య కాలంలో తిరు మూవీ తో కూడా ధనుష్ తెలుగు లో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ తెలుగు ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటు వంటి దర్శకులలో ఒకరు అయిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ ,  సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన నానే వ‌రువేన్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ ని క‌లైపులి ఎస్‌థాను నిర్మించారు.

ఈ మూవీ ని తెలుగు లో నేనే వస్తున్నా అనే పేరుతో విడుదల చేయనున్నారు.  తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా , వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే నేనే వస్తున్నా మూవీ హక్కులను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్నటు వంటి గీత ఆర్ట్స్ బ్యానర్ వారు దక్కించుకున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిన నేనే వస్తున్నా మూవీ లో యోగిబాబు, ఇందుజా ర‌విచంద్ర‌న్ త‌దిత‌రులు న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: