అల్లు అర్జున్ చైల్డ్ యాక్టర్ ఇప్పుడు హీరోయిన్..!!

Divya
చైల్డ్ ఆర్సిస్టులలో కొంతమంది మాత్రమే హీరోయిన్లుగా కొనసాగిన వారు ఉన్నారు. అలాంటి వారిలో శ్రీదేవి, మీనా తదితర హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత స్థానంలో పాపులర్ అయిన చైల్డ్ ఆర్టిస్టులు ఎవరూ లేరు అయితే మళ్లీ ఇంత కాలానికి చైల్డ్ ఆర్టిస్టుల హవా పెరుగుతోంది. అలాంటి వారిలో హీరోయిన్గా రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది చైల్డ్ యాక్టర్ కావ్య. మసూద అని సినిమాతో మొదటిసారిగా వెండి తెరపై పరిచయం కాబోతోంది.. ఆమె తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేయడం జరిగింది.

ఠాగూర్, గంగోత్రి, బాలు, బన్నీ ,అడవి రాముడు తదితర సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా నటించిన నటి కావ్య   ప్రస్తుతం మసూద అనే చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలియజేసింది. మసూద అనే పదం ఉర్దూ పదమని గుడ్ ఉమెన్ అర్థమని తెలియజేసింది. ఇక అంతే కాకుండా ఇది ఒక హర్రర్ డ్రామా చిత్రమని తెలియజేసింది కావ్య. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా తెలుగులో రాలేదని తెలిపింది చిన్నప్పటి నుంచి తను ఏం చేసినా ఎలా చేసినా బాగుంది అనేవారని తెలియజేసింది కావ్య. అయితే ఇప్పుడు నటించడానికి మాత్రం చాలా కష్టపడవలసి వస్తోంది అని తెలియజేసింది.

ఇక చైల్డ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఆటలు ఆడుకోవడానికి అందరూ ఎలా వెళ్తారు షూటింగ్ అనగానే అలా వెళ్లే దాన్ని అని తెలియజేసింది కావ్య. ఇలా అయితే తన చదువు పాడవుతుందని భావించి 12 ఏళ్లకు సినిమాలకు దూరం ఉంచారని తెలియజేసింది. దీంతో తను ప్రస్తుతం లా పూర్తి చేశానని మళ్లీ సినిమాల్లో నటించాలని ఆసక్తిగా ఇటువైపుకు వచ్చానని తెలిపింది కావ్య. కోవిడ్ సమయంలో కాళి సమయం ఎక్కువగా ఉండటం వల్ల నేను సినిమాలలోకి వెళితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: