ఆ స్టార్ హీరోతో లవ్ ఎఫైర్ నడిపిన సదా.. కానీ చివరికి..?

Anilkumar
టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లా కనిపించే హీరోయిన్ సదా .ఇక  నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో సదా అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అమాయకపు ముఖంతో కనిపించి ప్రేక్షకులను అలరించింది.కాగా జయంలో పిరికి పాత్రలో నటించిన హీరో నితిన్‌ను వెళ్లవయ్యా వెళ్లు అంటూ సదా చెప్పే డైలాగ్ అప్పట్లో థియేటర్లను ఓ ఊపు ఊపేసింది. ఇక జయం తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లను అందుకుంది.అయితే  పవన్ కల్యాణ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.కాగా విక్రమ్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమాతో ఆమె సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ అయిపోయింది.

ఆ  తర్వాత బాలయ్యతో వీరభద్ర లాంటి సినిమా కూడా చేసింది. ఇక ఎన్టీఆర్‌తో నాగ సినిమాలో నటించింది.  అందం అభినయంతో పాటూ టాలెంట్ ఉన్నప్పటికీ సదా వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేకపోయింది. రీఎంట్రీ ఇచ్చిన తరవాత సదా టీవీ షోలతో బిజీగా మారియింది. ఇక ఈటీవీలో పలు షోలకు జడ్జిగా వ్యహరించింది అలరించింది. కాగా తన మాటలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సదా నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్నా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది.  సదా పెళ్లి విషయంలో అప్పట్లో కొన్ని వార్తలు కూడా చెక్కర్లు కొట్టాయి.అయితే  సదా తమిళ స్టార్ హీరో మాధవన్ ను అప్పట్లో ప్రేమించిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఆమె ఎంతో ఇష్టంగా ప్రేమించినప్పటికీ మాధవన్ ను సదా పెళ్లి చేసుకోలేకపోయిందట.  అంతేకాదు చాలా కాలం పాటూ ఈ జంట ప్రేమాయణం నడిపించినప్పటికీ కేవలం కుటుంబ పరిస్థితుల వల్లే విడిపోవాల్సి వచ్చిందని టాక్.ఇదిలావుంటే గతంలో కూడా సదా మాధవన్ ను ప్రేమించినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి.  సదా మాత్రం మాధవన్ తో లవ్ పై ఎప్పుడూ స్పందించలేదు. ఇక దాంతో మాధవన్ తో లవ్ అంటూ వచ్చే వార్తలకు బలం చేకూరినట్టు అయ్యింది. కాగా ఆ తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి. అయితే వీరి మధ్య ఏదో గ్యాప్‌తో దూరమైపోయారు.సదా ప్రస్తుతం ఓటిటి లో కూడా ఆఫర్ లు అందుకుంటుంది.. టాలీవుడ్ లోని ఓ బడా హీరో సినిమాలో నెగిటి్వ్ రోల్ లో నటించే ఛాన్స్ కూడా వచ్చినట్టుగా టాక్ విపిస్తోంది.  మాధవన్ విషయానికి వస్తే ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా సాలా కుద్దూస్ అనే సినిమాల నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సదా ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటుందా లేదంటూ ఇలాగే ఉండిపోతుందా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: