ప్రభుదేవాకు ఈ స్టార్ హీరోల డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట..!!

Anilkumar
ఇండియాలో డ్యాన్స్  లెజెండ్ గా ప్రభుదేవాను పిలుచుకుంటూ ఉంటారు.అయితే  ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు గాంచిన ప్రభుదేవా కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ గానే కాకుండా దర్శకుడిగా, హీరోగా పలు సినిమాలు చేశారు.ప్రజెంట్ ఆయన  ఓ వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపున దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.అంతేకాదు తెలుగుతో పాటు హిందీలో ఇప్పటికే పలు సినిమాలకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇక ఈ సంగతులు అలా పక్కనబెడితే.. హీరోగా ప్రభుదేవా చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.అయితే  ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా 'ప్రేమికుడు' సినిమా చేశారు. 

కాగా ఈ చిత్రంలో ప్రభుదేవా డ్యాన్స్ చూసి జనాలు ఫిదా అయ్యారు.అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీల్లో హీరోలు ప్రస్తుతం డ్యాన్స్ పైన ఫుల్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇక ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కష్టపడుతున్నారు.  డ్యాన్స్ లో మాత్రం ప్రభుదేవాను మించిన వారు లేరు అని సినీ ప్రియులు అంటుంటారు. ఇక అటువంటి ప్రభుదేవా తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు.ఇకపోతే ఓ ఇంటర్వ్యూలో తనకు ఈ స్టార్ హీరోల డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ప్రభుదేవా చెప్పారు. ఇక వారు ఎవరెవరంటే…తెలుగులో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు.

అంతేకాదు  త్వరలో 'గాడ్ ఫాదర్' గా చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ సాంగ్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇకపోతే థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.అంతేకాకుండా తమిళ్ లో తలపతి విజయ్ డ్యాన్సింగ్ స్టైల్ బాగుంటుందని పేర్కొన్న ప్రభుదేవా.. హిందీలో షాహిద్ కపూర్, హృతిక్ రోషన్ డ్యాన్సింగ్ స్టైల్ బాగుంటుందని తెలిపారు.ప్రస్తుతం ప్రభుదేవా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.ఇక ప్రభుదేవా ఇటీవల మై డియర్ భూతం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: