బిగ్ బాస్ షో పై మరోసారి విరుచుకుపడ్డ సిపిఐ నారాయణ..!

Pulgam Srinivas
తెలుగు లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో 5 సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అలాగే తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' నాన్ స్టాప్ కూడా ఒక సీజన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 6 వ సీజన్ కూడా సెప్టెంబర్ 4 వ తేదీ నుండి ప్రారంభం అయ్యింది.

ఈ 6 వ సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షో కు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ రియాల్టీ షో పై సి పి ఐ నారాయణ మరో సారి విరుచుకుపడ్డాడు. ఇది వరకే కొన్ని సార్లు సి పి ఐ నారాయణ బిగ్ బాస్ రియాల్టీ షో పై తనదైన రీతిలో స్పందించాడు.

మరో సారి బిగ్ బాస్ రియాల్టీ షో పై నారాయణ స్పందిస్తూ ... కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి షో లు ఉంటాయి అని సి పి ఐ నారాయణ అన్నారు. అలాగే బిగ్ బాస్ షో తో ఏం సందేశం ఇస్తున్నారు అని ప్రేక్షకులు ప్రశ్నించాలి అని నారాయణ కోరారు. అలాగే బిగ్ బాస్ షో ను బూతుల స్వర్గంగా మారుస్తారా అని సి పి ఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమయాన్ని వృధా చేసే షో గా బిగ్ బాస్ షో ను ఆయన పేర్కొన్నారు. ఇలా  సి పి ఐ నారాయణ తాజాగా బిగ్ బాస్ షో పై తనదైన రీతిలో స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: