ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి: మహేష్ ద్వారా ట్రైలర్ రిలీజ్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా ఇంకా మహేష్ బాబు బావమరిదిగా తెలుగు తెరకు “SMS” చిత్రంతో పరిచయమైన హీరో సుధీర్ బాబు. తన వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.ఇప్పుడు సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల అవుతుండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచాయి.కాగా సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ కలయికలో ఇది మూడో సినిమాగా రానుంది. కృతి శెట్టి సుధీర్ బాబుకు జంటగా నటిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మోహనం తరువాత వివేక్ సాగర్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ బట్టి చూస్తే ఈ మూవీలో హీరో సుధీర్ బాబు సినిమా దర్శకుడి పాత్రలో, హీరోయిన్ కృతి కళ్ళ డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇక ఈ సినిమా ట్రైలర్ ని సోమవారం సాయంత్రం గం.5:04 నిమిషాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సమ్మోహనంతో ఆకట్టుకున్న సుధీర్, ఇంద్రగంటి కాంబినేషన్ ఈ చిత్రంతో ఎంతవరకు ఆకట్టుకోగలదో వేచి చూడాలి.ఇంకా గత కొంత కాలంగా వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న సుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే.. "సర్కారు వారి పాట"తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు.ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఫస్ట్ టైం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: