ఈ వారం మంచి అంచనాల నడుమ విడుదలయిన ఆ రెండు మూవీలకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురు దెబ్బ..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా తెలుగు సినిమాలు థియేటర్ లలో విడుదల అయ్యాయి. కాకపోతే ఈ వారం విడుదల అయిన చాలా సినిమాలు థియేటర్ లలో విడుదల అయినప్పటికీ తెలుగు సినీ ప్రేమికులు మాత్రం పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా గిరిశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ పై అలాగే  శ్రీకాంత్ రెడ్డి , సంచిత బాషు ప్రధాన పాత్రలలో  వంశీధర్ గౌడ్ , లక్ష్మీనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ రెండు మూవీ లపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ లపై మంచి అంచనాలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఈ మూవీ ల విడుదలకు ముందు ఈ మూవీ ల నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం మరియు ఈ చిత్ర బృందాలు ప్రమోషన్ లను కూడా అదిరిపోయే రేంజ్ లో నిర్వహించడంతో ఈ రెండు మూవీ లపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్  2 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయిన ఈ రెండు సినిమాలు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి.

దానితో ఈ రెండు మూవీ లకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ లభించినప్పటికీ ఆ తర్వాత నుండి మాత్రం ఈ రెండు మూవీ లకు చిత్ర బృందం ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు దక్కడం లేదు. ఇలా ఈ వారం మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుదెబ్బే తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: