ఫ్యాన్స్ ను నిరాశపరిచిన "అర్జున్ రెడ్డి" డైరెక్టర్ ?

VAMSI
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా థియేటర్ లలో రిలీజ్ అయింది. ఈ సినిమాపై ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. తాను నటించిన మొదటి సినిమా ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకుని ఘనంగా తాన్ ఎంట్రీ ఇచ్చినా... రెండవ సినిమా కొండపొలం తో కాస్త ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. అందుకే ఈ సారి మంచి సినిమాతో హిట్ కొట్టలాని భావించి "అర్జున్ రెడ్డి" లాంటి సినిమాను తమిళ్ లో "ఆదిత్య వర్మ" పేరుతో రీమేక్ చేసిన గిరీశయ్య అనే డైరెక్టర్ కు ఈ బాధ్యతను అప్పగించాడు.
సినిమా పట్ల ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన ప్రకారం... ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ఇక్కడ పంచుకుంటున్నాము.
గిరీశయ్య ఈ సినిమా ద్వారా ఒక మంచి ఫ్యామిలీ, లవ్ , ఎమోషనల్ కథను చెప్పడానికి చాలా చక్కగా ప్రయత్నించాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ రిషి పాత్రలో చాలా బాగా నటించాడు, రాధ పాత్రలో హీరోయిన్ గా చేసిన కేతిక శర్మ లుక్స్ పరంగా పర్వాలేదనిపించినా, నటనలో మాత్రం ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. ఇక ఓవరాల్ గా కెప్టెన్ అఫ్ ది షిప్ గిరీశయ్య గురించి మాట్లాడుకుంటే... కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన సమస్య అని చెప్పాలి. ఈ సినిమా చూశాక ప్రతి ప్రేక్షకుడికి మొత్తం నాలుగు సినిమాలు గుర్తుకు రావడం పక్కా అని తెలుస్తోంది. నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి, ఆనందం మరియు నిన్నే పెళ్లాడుతా సినిమాలు అన్నీ కలబోసి తీసిన సినిమాగా రంగ రంగ వైభవంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
ఫ్యామిలీ మూవీ కాబట్టి ఈ సినిమాను కొంతమంది ప్రేక్షకులు ఇవన్నీ మరిచిపోయి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.
అయితే బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం అర్జున్ రెడ్డి లాంటి కథను డీల్ చేసిన గిరీశయ్య నుండి ఈ విధమైన టేకింగ్ ను, స్క్రీన్ ప్లే ను అస్సలు ఊహించలేదు అంటున్నారు. మరి చూద్దాం ప్రేక్షకులు ఈసినిమాను ఆదరిస్తారా లేదా అన్నది తెలియాలంటే వారాంతం వరకు ఆగాల్సిందే.
   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: