వైరల్ అవుతున్న ప్రభాస్, కృతిసనన్ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే..?

Anilkumar
బాలీవుడ్ ప్రొడ్యూసర్ కాఫీ విత్ కరణ్ 7 షో ఎంతగా పాపులర్ అయ్యిందో మనందరికి తెలిసిన విషయమే .అయితే  ఇటీవల సమంత, విజయ్ దేవరకొండ వంటి సౌత్ సెలబ్రెటీలు పాల్గోన్న ఈ షో దక్షిణాదిలోనూ ఆదరణ పొందింది.ఇక ఇందులో కరణ్ సెలబ్రెటీల అప్డేట్స్ మాత్రమే కాకుండా.. వారి వ్యక్తిగత విషయాల గురించి పలు ప్రశ్నలు అడుగుతూ నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇకపోతే తాజాగా ఈషోలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, హీరో టైగర్ ష్రాఫ్ పాల్గోన్నారు.కాగా  వీరిద్దరి ఎపిసోడ్‏కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక  ఇందులో రాపిడ్ ఫైర్ రౌండ్‏లో భాగంగా వారి కోస్టార్స్‏లలో ఒకరికి కాల్ చేయాలని కరణ్ సూచించారు.

అయితే  దీంతో కృతి సనన్.. తన కోస్టార్ ప్రభాస్‏కు కాల్ చేసింది. పోతే వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక అందులో కృతి సనన్ ప్రభాస్‏కు కాల్ చేసి.. హే కరణ్.. ఇది నేనే అని చెప్పమని కోరడంతో ప్రభాస్ అలాగే చెప్పేశాడు.. అయితే దీంతో కృతి 2 పాయింట్స్ గెలుచుకుంది. వెంటనే తన కాల్ లిఫ్ట్ చేసిన యంగ్ రెబల్ స్టార్‏కు ధన్యవాదాలు తెలుపుతూ.. మీరు అమెజింగ్ అని తెలిపింది.ఇక  షో తర్వాత మిమ్నల్ని కలుస్తాను అని కృతి చెప్పగా.. సరే జాగ్రత్త అంటూ సమాధానమిచ్చాడు ప్రభాస్. వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

కాగా కాఫీ విత్ కరణ్ షోలో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ లలో ప్రభాస్, కృతి సంభాషణ సూపర్ అని.. చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక ఇదిలా ఉంటే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇందులో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: