'ఓటిటి' ప్లాట్ ఫామ్ లో దూసుకుపోతున్న 'ఓదెల రైల్వే స్టేషన్' మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన హెబ్బా పటేల్ తాజాగా ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ నేరుగా ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినా ఆహా  'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఆగస్టు 26 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి తెలుగు ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన సంపత్ నంది కథ మరియు స్క్రీన్ ప్లే ను అందించాడు .

ఈ మూవీ కి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. వశిష్ట సింహ ,  పూజిత పన్నోడ , సాయి రోనక్ తదితరులు ఈ మూవీ లో ముఖ్యవపాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఆగస్టు 26 వ తేదీన ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల అయిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 1.5 స్ట్రీమింగ్ మినిట్స్ ని పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు సంపత్ నంది తెలియ జేశారు. అలాగే ఓదెల రైల్వే స్టేషన్ మూవీ కి ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన కు సంపత్ నంది ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దర్శకుడు సంపత్ నంది చివరగా సిటీ మార్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో గోపీచంద్ హీరోగా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ  మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన సీటి మార్ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: