ఆ పాత్ర కోసం.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన విశాల్?

praveen
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్ర కోసం ఆయన చేసిన సాహసాలు అందరిని అబ్బుర పరుస్తూనే ఉంటాయి. తెలుగువాడే అయినప్పటికీ తమిళ్ సినిమాల్లో సెటిల్ అయ్యి అక్కడ స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. ఇక తన సినిమాలను తెలుగులో కూడా డబ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరించే అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ అందరి హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటాడు విశాల్. ఇటీవలి కాలంలో అయితే హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

 ఇకపోతే ఇప్పుడు వరకు సినిమాలోని పాత్రల కోసం తన బాడీ ని ఎన్నోసార్లు పాత్రకు తగ్గట్లుగా మలచుకున్నాడు. బరువు పెరగడం బరువు తగ్గడం లాంటివి చేసాడు. అంతేకాదండోయ్ తన సినిమాలలో స్టంట్స్ డూప్ పెట్టుకోకుండా రిస్కీ స్టంట్స్  చేస్తూ గాయాల బారిన పడుతూ ఉంటాడు విశాల్. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. విశాల్ కెరియర్లో 33వ చిత్రంగా 'మార్క్ ఆంటోనీ ' అనే సినిమా తెరకెక్కుతోంది. మినీ స్టూడియోస్ పతాకంపై రీతువర్మ, సునీల్ వర్మ అభినయ లాంటి నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. అధిక్ రవి చంద్రక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

 పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.అంతేకాదండోయ్ ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తమిళ తెలుగు మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇటీవలే వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్భంగా మార్క్ ఆంటోనీ సినిమాలోని విశాల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది  చిత్ర బృందం. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే విశాల్ గుర్తు పట్టలేనంతగా పాత్ర కోసం మారిపోయాడు. ఎంతో రౌద్రంగా షాట్ గన్ పట్టుకొని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో ఉన్నాడు. ఇది చూసి వామ్మో విశాల్ ఇంతలా మారిపోయాడు ఏంటి అని అనుకుంటున్నారట అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: