లైగర్ గురించి మైక్ టైసన్ మర్చిపోయాడుగా.. వైరల్ వీడియో?

praveen
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాత ఛార్మికి చివరకు కష్టాలు తప్పడం లేదు అన్నది తెలుస్తుంది. మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్  నటించాడు. ఇక మైక్ టైసన్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు పూరి జగన్నాథ్ కూడా బాగానే కష్టపడ్డాడు అని చెప్పాలి.

 బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటించడంతో ఈ సినిమాలో అతని పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అంతే కాదు విజయ్ దేవరకొండ టైసన్ మధ్య ఫైట్ కూడా ఒక రేంజ్లో ఉంటుందని ఎంతోమంది అంచనాలు పెట్టుకున్నారు. కాని చివరలో కేవలం కొన్ని నిమిషాల పాటు కనిపించాడు మైక్ టైసన్.. బాక్సింగ్ లెజెండ్ లా కాదు ఒక కమెడియన్ లాగానే అతన్ని  చూపించారు. ఇక ఇది అటు ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు అని చెప్పాలి. దానికి తోడు విజయ్ దేవరకొండ మైక్ టైసన్ ను చితకబాదడం.. అతని చేతిలో ఓడిపోవడం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.

 ఇకపోతే ఇప్పుడు మైక్ టైసన్ లైగర్ చిత్రంలో నటించిన విషయం మరిచిపోయాడ అంటే ఇటీవల అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే అవును అని అంటారు అందరు. ఓ పాడ్కాస్ట్ వీడియో లో భాగంగా స్నేహితులతో కలిసి మాట్లాడుతుండగా లైగర్ లో మీ పాత్ర ఏంటి అంటూ మైక్ టైసన్ ని అడుగుతారు. లైగర్ ఏంటో అర్థం కాక అతను తికమక పడతాడు. లైగర్ సినిమాలో నటించిన విషయం అతనికి గుర్తుకు రాదు. ఏది మళ్లీ ఒకసారి చెప్పు అని అడుగుతాడు మైక్ టైసన్. గూగుల్లో సెర్చ్ చేసి బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఇండియన్ స్పోర్ట్స్ అండ్ ఫిలిం లో నటిస్తున్నాడు అని చదివి వినిపించారు. అప్పుడు కానీ లైగర్ అతనికి గుర్తు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: