అనసూయకి శ్రద్ధదాస్ సపోర్ట్.. ఆడుకుంటున్న నెటిజన్స్?

Purushottham Vinay
సోషల్ మీడియా డెవలప్ అయిన దగ్గర నుంచి ఈమధ్య సెలబ్రిటీలకు పబ్లిసిటీ పిచ్చి పట్టకుందా లేక సోషల్ మీడియాలో ఏదో రకంగా తమ పేరు నానుతూ ఉండాలని ప్లాన్ చేస్తున్నారో తెలియదు కాని ముక్కు,ముఖం తెలియని వాళ్లతో కూడా కొట్లాట పెట్టుకొని తెగ తిట్టించుకుంటున్నారు.మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో  ఫైట్‌ చేస్తున్న వాళ్లలో నిన్నటి వరకు కూడా డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ, నిర్మాత బండ్లగణేష్‌, మంచు విష్ణు, శ్రీ రెడ్డి, ఎస్ ఎస్ తమన్, విజయ్ దేవరకొండ, చిన్మయి శ్రీపాద పేర్లు మాత్రమే బాగా వినిపించేవి.కానీ ఇప్పుడు యాంకర్ అనసూయ పేరు సోషల్ మీడియాలో బాగా మార్మోగిపోతోంది. అనసూయను నెజిటన్లు చాలా ఘోరంగా ట్రోల్ చేస్తుంటే మధ్యలో దూరిన మరో సెకండ్‌ హీరోయిన్‌ని కలిపి కూడా ఎన్నో రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇది చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.జబర్దస్త్ యాంకర్ అనసూయ మోడ్రన్ డ్రెస్సులు వేసుకొని బుల్లితెరపై డ్యాన్స్‌లు, వెండితెరపై విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తూ సోషల్ మీడియాలో అంతే పాపులారిటీ సంపాధించుకుంది. సరే దాన్ని కంటిన్యూ చేద్దామని చాటింగ్, ఫోటోలు షేర్ చేస్తూ ఇప్పుడు కాంట్రవర్సీని కొని తెచ్చుకుంటున్నారు అనసూయ. రీసెంట్‌గా ఆమెను ఆంటీ అంటున్నారని చాలా చులకనగా, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని సోషల్ మీడియా  వేదికగా నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చింది. ఈ ఇష్యూ ఇప్పుడు ముదిరిపోయింది. 


అనసూయ ఇద్దరు పిల్లల తల్లి 37సంవత్సరాలు ఉంటే ఆంటీ కాక ఏమవుతుందని ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు.అనసూయను ఓ రేంజ్‌లో నెటిజన్లు ట్రోల్ చేయడంతో ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది యాక్టరస్ శ్రద్ధదాస్. బాధ పడకు అనసూయ నీ వయసులో సగం ఉన్నవాళ్లకంటే నువ్వే చాలా యంగ్‌గా ఉన్నావంటూ అనసూయకు అండగా నిలబడింది. నిన్ను చూస్తే అదిరిపోవాలంతే అంటూ కామెంట్స్ షేర్ చేసింది శ్రద్ధదాస్. అంతటితో ఆగకండా నీ వయసుకు రెట్టింపు ఉన్న అంకుల్స్‌ కంటే నువ్వే హాట్‌గా ఉన్నావు నీ అభిమానినైపోయా అంటూ సపోర్ట్‌ చేసింది శ్రద్ధదాస్.అనసూయను ఓదార్చాలని చూసిన శ్రద్ధదాస్‌ని టార్గెట్‌ చేసుకున్నారు నెటిజన్లు. టాపిక్ తనవైపు డైవర్ట్ అయిందని తెలుసుకున్న శ్రద్ధదాస్ వెంటనే మరోపోస్ట్ చేసి నన్ను తిట్టడానికి మీ టైమ్, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు..నన్ను ట్రోల్ చేస్తే నేను బ్లాక్ చేయడమో, డిలీట్ చేయడమో చేస్తానంతే అంటూ చురకలు అంటించింది. అనసూయను మెచ్చుకున్నందుకు నన్ను ట్రోల్ చేయడంలో అర్ధం లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది హాట్ బ్యూటీ శ్రద్ధదాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: