యూట్యూబ్ లో ఆ మార్క్ ను టచ్ చేసిన మాచర్ల నియోజకవర్గం 'రా రా రెడ్డి ఐ ఆమ్ రెడీ' సాంగ్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కింది. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. నితిన్ మొట్ట మొదటి సారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటించడం మరియు మాచర్ల నియోజకవర్గం మూవీ లోని నితిన్ కలెక్టర్ పాత్రను పోషించడంతో ఈ మూవీ పై నితిన్ అభిమానులతో పాటు మాములు సినీ ప్రముఖులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.
 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలలో 'రా రా రెడ్డి ఐ ఆమ్ రెడీ' సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ ద్వారా కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సాంగ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లాల్ ఒకరు ఆయన అంజలి నటించింది. మహతి స్వర సాగర్ ఈ సాంగ్ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో ఒక రేర్ మార్క్ ని టచ్ చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో తాజాగా 50 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది. ఈ సాంగ్ లో నితిన్ మరియు అంజలి వేసిన స్టెప్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువగా , ఈ సాంగ్ లో అంజలి అందచందాలు ఈ సాంగ్ కి  మరింత ఆకర్షణను తీసుకు వచ్చాయి. మొత్తంగా ఈ సాంగ్ సినిమా విడుదల తర్వాత కూడా అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: