మహేష్ బాబు 28వ సినిమాలో రెండవ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు మరి కొన్ని రోజుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొంత కాలం ఆలస్యం అవుతుంది . మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరీర్ లో 28 వ సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ మూవీ లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్.లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పూజా హెగ్డే ఈ మూవీ లో మెయిన్ హీరోయిన్ గా నటించనుండగా, ఈ మూవీ లో రెండవ హీరోయిన్ గా చిత్ర బృందం ప్రియాంక అరుల్ మోహన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రియాంక అరుల్ మోహన్ ఇప్పటికే తెలుగు లో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం మూవీ లో హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయిన డాక్టర్ మరియు డాన్ మూవీ లతో తమిళ నాట మంచి విజయాలను అందుకుంది. మహేష్ బాబు ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: