ఆ మూవీతో అయిన కిరణ్ అబ్బవరం కి హిట్ పడేనా..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరు ఆయన కిరణ్ అబ్బవరం 'రాజా వారు రాణి గారు' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ ఇచ్చిన జోష్ లో కిరణ్ అబ్బవరం వరుస మూవీ లలో నటించాడు. అందులో భాగంగా ఈ హీరో నటించిన సేబాస్టియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలవగా , సమ్మతమే సినిమా బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో హీరోగా నటించాడు. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ మూవీ ని నిర్మిస్తోంది.

ఈ మూవీ లో కిరణ్ అబ్బవరం కి జోడీగా సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించింది.  సెప్టెంబర్  9 వ తేదీన ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలా ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు కాస్త అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో ఆయన కిరణ్ అబ్బవరం బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: