డైరెక్టర్ కు క్షమాపణలు చెప్పిన అనుపమ..?

Anilkumar
ప్రస్తుతం కార్తికేయ-2 సంచలన వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇదిలావుంటే ఇక ఈ నేపధ్యంలో చిత్రం యూనిట్ ...సక్సెస్ మీట్ నిర్వహించింది.అయితే  ఆ స్టేజీపై దిల్ రాజు ...మీడియాకు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. ఇక అనుపమా పరమేశ్వరన్ అయితే డైరక్టర్ చందూ మొండేటికి మనస్పూర్తిగా క్షమాపణలు తెలిపింది. అయితే రెండేళ్ళ క్రితం మొదలైన ఈ సినిమా, ఇప్పుడు జనం ముందుకు వచ్చి ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందని చెబుతూనే. షూటింగ్ లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని అనుపమా గుర్తు చేసుకుంది.ఇకపోతే అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ...'గుజరాత్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు బ్యాక్ ఏక్ వచ్చిందని,

 అయినా ఎలాగో కష్టపడి ఆ షెడ్యూల్ పూర్తి చేశాన'ని చెప్పింది.అయితే  ఒక రోజు టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ చాలా ఆలస్యమైందని, తనకూ బాగా పెయిన్ ఉండటంతో, ఫ్రస్ట్రేషన్ కు గురై, 'చందు మొండేటి తో వర్క్ చేయడం పట్ల రిగ్రేట్ ఫీలవుతున్నాన'ని చెప్పానని తెలిపింది.ఆఅంతేకాదు  ఆ రోజు తాను అలా మాట్లాడుకుండా ఉండాల్సిందని, తన వైపు నుండి పెద్ద తప్పే జరిగిందని అనుపమా బాధపడింది. ఇక అందుకు ఆయనకు ఇవాళ బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని అనుపమా అంది. పోతే ఆయనతో వర్క్ చేయడం వల్లే ఇంత గొప్ప విజయం తనకు లభించిందని చెప్పింది.ఇక  ఈ విజయాన్ని హీరో నిఖిల్ తో పాటు తానూ ఇంకా జీర్ణించుకోలేకుండా ఉన్నానని, ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకుడు చందూ మొండేటికి అనుపమా పరమేశ్వరన్ కృతజ్ఞతలు తెలిపింది.

పోతే ఇక ఈ చిత్రం రిలీజ్ కు ముందు జరిగిన ప్రమోషన్స్ కు హీరోయిన్‌ అనుపమ డుమ్మా కొట్టింది.కాగా  ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. షూటింగ్ 5 గంటలకు ఉన్న సరే టైం కి వచ్చేస్తుంది కానీ ప్రమోషన్స్ అంటే మాత్రం అనుపమ నుంచి మంచి రెస్పాన్స్ ఉండదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన అనుపమ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అయితే నేను కార్తికేయ సినిమా ప్రమోషన్ కి ఎందుకు రావడం లేదు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను.ఇకపోతే 'కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా.అంతేకాదు  నేను మరో రెండు సినిమాలకోసం పగలనకా రాత్రనకా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఇక ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్‌ సన్నివేశాలను ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు.ఇదిలావుంటే  మరోవైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు నేను ప్లాన్‌ చేసుకున్నా.అయితే  కానీ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది.అందుకే ఇక్కడ డుమ్మా కొట్టలేని పరిస్థితి. అంతె కాక నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాఅంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: