'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' మూవీ నుండి సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
రాజావారు రాణి గారు మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణి వారు మూవీ తర్వాత ఈ యువ హీరో ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ద్వారా కిరణ్ అబ్బవరం కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లో కూడా హీరోగా నటించాడు.
 

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా , ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక  సాంగ్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. 'నచ్చావ్ అబ్బాయి' అంటూ సాగే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సాంగ్ కి భాస్కర భట్ల లిరిక్స్ అందించగా , ధనుంజయ్ , లిప్సిక ఈ సాంగ్ ని పాడారు. శ్రీధర్ గడే ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , కోడి దివ్య ఎంటర్టైన్మెంట్ పై కోడి రామకృష్ణ గారి ప్రధమ కుమార్తె దివ్య దీప్తి ఈ మూవీ ని నిర్మించారు. ఈ మూవీ కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించాడు. మరి ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: