నా కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు... నితిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ హీరోల్లో ఒకరు అయిన నితిన్ ఆఖరుగా మాస్ట్రో మూవీ లో హీరోగా నటించాడు. కాకపోతే మ్యాస్ట్రో సినిమా థియేటర్ లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే తాజాగా నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' అనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో నితిన్ కలెక్టర్ పాత్రలో నటించాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , సముద్ర ఖని ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. క్యాథరిన్ , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించగా , మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

నిన్న అనగా ఆగస్ట్ 12 వ తేదీన భారీ ఎత్తున మాచర్ల నియోజక వర్గం మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ ను మూవీ యూనిట్ నిర్వహించింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా నితిన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మాచర్ల నియోజకవర్గం మూవీ సక్సెస్ మీట్ లో భాగంగా నితిన్ మాట్లాడుతూ ... తెలుగు ప్రేక్షకులకు పెద్ద థాంక్స్ , నా కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ లను ఇచ్చారు. సెకండ్ డే కూడా చాలా బలంగా ఉందని చెబుతున్నారు.  మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని నమ్మరు  , నా నమ్మకం మాచర్ల నియోజకవర్గం మూవీ తో మరో సారి నిజమైంది అంటూ నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం సక్సెస్ మీట్ లో మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: