'ఆర్ సి 15' అప్డేట్ కోసం రచ్చ చేస్తున్న రామ్ చరణ్ అభిమానులు..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరుత మూవీ తో వెండితెరకు పరిచయం అయిన రామ్ చరణ్ , దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర మూవీ తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను అందుకొని కొత్త కొత్త రికార్డ్ లను నమోదు చేశాడు. రామ్ చరణ్ ఆ తర్వాత రచ్చ , నాయక్ , ఎవడు ,  ధ్రువ , రంగస్థలం తాజాగా విడుదలయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లతో అద్భుతమైన విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని తనకంటూ హీరోగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, సునీల్, అంజలి ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

ఎస్ జే సూర్య ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. అయినప్పటికీ ఈ మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. దానితో ఈ మూవీ బృందం పై రామ్ చరణ్ అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఇక దీనితో రామ్ చరణ్ అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ చేస్తున్నారు. తాజాగా నిర్మాత దిల్ రాజు పై ఒక ప్రేస్ ట్యాగ్ తో “వేకప్ దిల్ రాజు” అంటూ తమ మూవీ కి అప్డేట్ కోసం నేషనల్ వైడ్ గా ఫుల్ ట్రెండ్ ని చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: