మహేష్ కోసం నమ్రత చేసిన త్యాగం ఏంటో తెలుసా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ కేవలం రీల్ శ్రీమంతుడే కాదు, రియల్ శ్రీమంతుడిగా కూడా ఎందరో మనసులు గెలుచుకున్నాడు.1975 ఆగస్టు 9 వ తేదీన జన్మించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.నట శేఖర సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణ కంటే కూడా ఓ మెట్టు ఎక్కువే ఎదిగారు. ఏపీ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు, వేయి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ కూడా చేయించారు. కొంచెం విరామం దొరికితే భార్యాపిల్లలతో విహారాలకు వెళ్లడం సూపర్ స్టార్ మహేష్ కి చాలా ఇష్టం. అలాగే ఇంట్లో సితార ఇంకా గౌతమ్ తో కలిసి సరదా ఆదుకోవడం మహేష్ బాబుకి ఇష్టమైన అలవాటు.సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవహారాలన్నీ కూడా భార్య నమ్రతే చూసుకుంటుందని అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటిస్తుంటాడు. కానీ ఆ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు ఇంకా ప్రకటనలకు సంబంధిన విషయాలను కూడా ఆమె చూసుకుంటూ ఉంటుంది.


తన భర్తకు తగ్గట్టు నమ్రత నడుచుకుంటూ అందరి మన్ననలు పొందుతుంది. టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్ గా కూడా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. వంశీ సినిమా షూటింగ్‌ సమయంలోనే నమ్రత-మహేశ్‌ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను మహేష్‌ బాబు తొలుత కుటుంబం అంగీకరించలేదట.దీంతో మహేశ్‌ బాబు తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట. అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల చాలా కీలక పాత్ర పోషించిందట. ఇక దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత మహేష్ ప్రతి విషయంలో కూడా నమ్రత ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌ నుంచి కాస్ట్యూమ్స్‌ వరకు కూడా అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్‌ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ కోసం పీక్ స్టేజ్ లో వున్న తన కెరీర్ కి కూడా గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి ఓ మంచి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు.  /

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: