'థాంక్యూ' మూవీ 'ఓటిటి' అఫీషియల్ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య తాజాగా థాంక్యూ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా , విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించగా , ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ జులై 22 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది.
 

సినిమా విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. దానితో ఈ మూవీ కి మూవీ యూనిట్ ఆశించిన రేంజ్ లో కలెక్షన్ లు కూడా బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. దానితో చివరగా థాంక్యూ మూవీ బాక్సా ఫీస్ అపజయాన్ని అందుకుంది.  

ఇలా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి రాబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఆగస్ట్ 11 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది. మరి థియేటర్ లలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయిన ఈ మూవీ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: